అమరావతికి రుణంపై కీలక ఉత్తర్వులు!

85చూసినవారు
అమరావతికి రుణంపై కీలక ఉత్తర్వులు!
ఏపీ రాజధాని అమరావతిపై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధుల వినియోగంపైన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్డీఏకు ఈ మేరకు అధికారం కల్పిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. అమరావతి అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్