పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్ర దేశంలో కల్లోల వాతావరణం సృష్టించింది. అనేకమంది శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. దీంతో నెహ్రూ స్పందించి మద్రాసు నగరం మినహా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలని 1952, డిసెంబరు 19న పార్లమెంటులో ప్రకటన చేశారు. ఫజల్ అలీ నేతృత్వంలోని పునర్వ్యవస్థీకరణ సంఘం తీర్మానం మేరకు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆయన గుర్తుగా నెల్లూరు జిల్లాకు 2008లో ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’ అని పేరు పెట్టారు.