మే 13న నామినేషన్ వేయనున్న ప్రధాని మోదీ

52చూసినవారు
మే 13న నామినేషన్ వేయనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు తేదీ ఖరారైంది. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 13వ తేదీన మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి ప్రధాని నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదీ మరోసారి అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

సంబంధిత పోస్ట్