భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్‌లో ఏర్పాటుచేసిన ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. దీంతో గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి పంపనున్నట్లు ఎక్స్ వేదికగా ఇస్రో ప్రకటించింది.