ఆరు దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన దంపతుల్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఒకేరోజు నిద్రలోనే ఇద్దరు దంపతులు మృతి చెందిన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. డెంకణికోట సమీపంలోని మేగలపుండనూరు గ్రామానికి చెందిన గోవిందస్వామి(90), రామక్క(75) దంపతులకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. శనివారం రాత్రి ఆహారం తీసుకున్న ఆ దంపతులు.. ఆదివారం ఉదయం లేవలేదు. నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు తేలింది.