AP: కృష్ణా జిల్లా గుడివాడలో పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో 9 మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 డిసెంబర్ 25న రావి టెక్స్‌టైల్స్‌పై కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన 9 మంది వైసీప నేతలను పెదపారుపూడి స్టేషన్‌కు తరలించారు. నిందితులపై 143, 144, 188, 427, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.