తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ క్యాన్స్, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరీలో చేర్చింది. మినరల్ వాటర్‌ను తయారు చేసే కంపెనీలకు బీఐఎస్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదంటూ గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.