తెలుగురాష్ట్రాల్లో బుధవారం సంభవించిన స్వల్ప భూకంపంపై భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణం. కాళేశ్వరం పరిసర ప్రాంతమంతా ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలో కేంద్రం మ్యాప్ డిజైన్ చేసింది. వాటర్ స్టోర్ చేయడంతో ఆ ఒత్తిడి వల్ల కూడా ఇది జరగొచ్చు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన జియో టెక్నికల్ రిపోర్ట్ కూడా లేదు' అని పేర్కొన్నారు.