దేశం, రాష్ట్రం పట్ల పీవీ దార్శనికత స్ఫూర్తిదాయకం: CBN

2615చూసినవారు
దేశం, రాష్ట్రం పట్ల పీవీ దార్శనికత స్ఫూర్తిదాయకం: CBN
పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగువారందరికీ గర్వకారణమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. భారతరత్న బిరుదుకు పీవీ అన్ని విధాలా అర్హులని కొనియాడారు. పండితుడిగా, నాయకుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా పీవీ రాణించారని గుర్తుచేశారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు. దేశం, రాష్ట్రం పట్ల పీవీ దార్శనికత స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ట్యాగ్స్ :