AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం సోమవారం రాత్రి 9 గంటల వరకు 20,310 దరఖాస్తులు అందాయి. వీటిలో సోమవారం రోజే 12,036 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సల జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. ఏడు రోజుల వ్యవధిలోని ఇన్ని దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఆరు చొప్పున దరఖాస్తులు పడ్డాయి. అత్యధికంగా విజయనగరంలో 1,689 దరఖాస్తులు వచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి రూ.406.20 కోట్ల ఆదాయం సమకూరింది.