రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష

83చూసినవారు
రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్‌లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంఘీభావంగా అక్టోబరు 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రకటించింది. ఫైమా సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పని వాతావరణం మెరుగుపడాలనేది వారి డిమాండ్ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్