అడివి బాపిరాజు మీ బంధువా? అని అడివి శేష్‌ని అడిగిన పవన్ కళ్యాణ్

53చూసినవారు
అడివి బాపిరాజు మీ బంధువా? అని అడివి శేష్‌ని అడిగిన పవన్ కళ్యాణ్
అడివి బాపిరాజు హీరో అడివి శేష్‌కి వరసకు తాతయ్య అవుతారు. "పంజా సినిమాలో చేస్తున్నప్పుడు.. పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఓ రోజు ఆయనే నా దగ్గరకు వచ్చి 'అడివి బాపిరాజు గారు మీ బంధువు అవుతారా' అడిగారు. అవుననడంతో ఆయన రచనల గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకేమో వాటిల్లో చాలా వరకూ తెలియవు. దాంతో కేవలం తలాడిస్తూ ఉండిపోయా. అప్పుడే ధైర్యం చేసి 'ఏమీ అనుకోకపోతే మీ నంబరు ఇస్తారా' అని అడిగానని" అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సంబంధిత పోస్ట్