BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు ఊరట కలిగింది. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, 2 పూచికత్తులు సమర్పించాలని.. హైకోర్టు ఆదేశాలను పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్ కోర్టు కొట్టేసింది. పంజాగుట్ట ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో రాహిల్ అరెస్టు కాగా.. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు.