జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతులను చీకటి లేదా నీడ గ్రహాలని అంటారు. ముఖ్యంగా బుధుడు, బృహస్పతి రాశుల వారికి అనుకూలంగా ఉంటారని కొందరు వాస్తు నిపుణులు చెబుతుండగా, రాహువు కుంభ రాశి వారికి, కేతువు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటారని ఇంకొందరు పేర్కొంటున్నారు. రాహు అనుగ్రహంతో మానసిక స్థైర్యం, శత్రువు మిత్రుడిగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతే కాకుండా అకాల సర్ప దోషాలు తొలగుతాయని చెబుతున్నారు.