మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. తాజాగా శనివారం మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగులను ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. అయితే, ఈ బ్యాగుల తనిఖీలు మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగా మారాయి. బీజేపీ నాయకులకు సంబంధించిన బ్యాగులను తనిఖీ చేయడం లేదని కాంగ్రెస్ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.