నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ (వీడియో)

84చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇవాళ తన సోదరి ప్రియాంకా గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచే పోటీ చేసి 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. కాగా రాహుల్‌పై బీజేపీ నుంచి ఆ పార్టీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్