తెలంగాణలో వర్ష బీభత్సం (వీడియో)

48188చూసినవారు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో గజ్వేల్ తడిచి ముద్దయింది. అటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పలుచోట్ల వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడటంతో కలెక్టరేట్ ఎదుట వర్షం నీరు నిలిచింది. HYD నగర వ్యాప్తంగా అరగంట నుంచి వర్షం దంచికొడుతోంది. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బషీర్ బాగ్, అబిడ్స్, బేగంబజార్, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

సంబంధిత పోస్ట్