తెలంగాణలో ఎల్లుండి నుంచి వర్షాలు

65చూసినవారు
తెలంగాణలో ఎల్లుండి నుంచి వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 31 నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూన్ 1, 2 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాగల 2 రోజులు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రేపు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్