కొండబాబుని చావబాదిన రామా

12467చూసినవారు
కొండబాబుని చావబాదిన రామా
జానకి పుట్టింటికి బయలుదేరింది. అయితే జానకి కొండబాబుని కొట్టడానికి తన ప్రేమ విషయమే కారణం అని, ఆ కొండబాబు తనని బ్లాక్ మెయిల్ చేశారని వెన్నెల తన అన్నయ్య రామాకి చెబుతుంది. ఇక నేటి ఎపిసోడ్‌లో కొండబాబు తన తోటలో ఉండగా తన ఫ్యామిలీ జోలికొస్తే చంపేస్తానని కొండబాబుని రామా చావబాదుతాడు.

దీంతో కొండబాబు నన్ను క్షమించు అంటూ రామ చంద్ర కాళ్లు పట్టుకుంటాడు. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికిస్తే చంపేస్తా అని తల్లీకొడుకులకు గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోతాడు. మల్లిక టీవీ పెట్టేసరికి బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. ఆత్రేయపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని.. పసలపూడి వెళ్తున్న బస్ ఊరు చివరలోని లోయలో పడిపోయిందని చనిపోయిన వాళ్లలో జానకి ఉందని చెప్పడంతో రామా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయితే తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

సంబంధిత పోస్ట్