జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన ఛైర్మన్‌గా తమిళనాడుకు చెందిన విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. జూన్ 1, 2024తో జస్టిస్(రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తన పదవీకాలం పూర్తయ్యింది. అప్పటి నుంచి NHRC చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి సయానీ కమిషన్ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా పని చేస్తున్నారు.