ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశించిందని, ఈవీఎంల వినియోగాన్ని న్యాయస్థానం సమర్థించిందని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి గురువారం తెలిపారు. ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని కోర్టు వ్యాఖ్యానించిందని అన్నారు.