ఆదిబట్ల మున్సిపాలిటీలో కాలుష్య వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాటాడుతూ బొంగ్లూర్ గేటు పరిసర ప్రాంతంలో ఉన్న విష వాయువులను వెదజల్లే ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులను నివాస ప్రాంతములకు దూరంగా తరలించాలని కోరారు. కార్యక్రమంలో విజయలక్ష్మి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, మై హోమ్స్, సిఎంఆర్ రిచ్ మీడోస్, అంత: పురం, సప్తగిరి, గంగా నగర్ తదితర కాలనీ ప్రజలు పాల్గొన్నారు.