ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్ మెట్ లో విషాదం

55చూసినవారు
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బ్రిలియంట్ కాలేజీ వెనుక వైపున ఉన్న జనహర్ష వెంచర్లో ఓ మహిళ మృతి చెందింది. చెత్త కుప్పల వద్ద రాగి తీగలు (చెత్త )కోసం వైర్లు తగల బెట్టే క్రమంలో శరీరానికి నిప్పు అంటుకుని మహిళ మరణించింది. మృతురాలు హయత్ నగర్ రంగనాయకుల గుట్టకు చెందిన లలితగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్