హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు పరిశుభ్రవాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని గురువారం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తరచూ స్కూళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల్లో ఆహార కల్తీకి బాధ్యులైనవారి వేటు వేయాలని స్పష్టం చేశారు.