రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, గణేష్ నిమర్జనం వేడుకను సజావుగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సరూర్‌నగర్ చెరువును పరిశీలించారు. ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమర్జనం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సరూర్ నగర్ బండ్ ని మరమత్తులు చేయాలని తెలిపారు.