ఇంట్లో ఎవరు లేని సమయంలో బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మదన్ చౌదరి, మమతా చౌదరి దంపతులు తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ గ్రామంలో నివసిస్తున్నారు. భర్త, కొడుకులు సోమవారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఈ క్రమంలో మమతా ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.