ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన యానాల గంగాధర్ రెడ్డి మన్సూరాబాద్ హిమపురి కాలనీలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి కామినేని దారిలోని షిర్టీ సాయిబాబా దేవాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.