షటర్ పగులకొట్టి సెల్ ఫోన్ దుకాణంలో చోరీ చేసిన సంఘటన హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుంట్లూర్ గణేష్ నగర్ లో నివాసం ఉండే సత్యనారాయణ కుంట్లూర్ చౌరస్తాలో సత్య మొబైల్స్ దకాణం గత 8 నెలలుగా నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో దుకాణానికి తిరిగి రాగా షట్టర్ తాళాలు పగులకొట్టి ఉన్నాయి. వెంటనే ఆయన దుకాణంలోకి వెళ్లి చూడగా 45వేల విలువైన వస్తువులు, నగదు చోరికి గురైనట్లు గుర్తించారు.