బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని నాయకులు కొనియాడారు. గురువారం కడ్తాల్ లో యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.