తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కడ్తాల్ కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస బేసిక్ పే ఇవ్వాలని వారు కోరారు. అందరూ ఉద్యోగుల లాగా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.