కబ్జాకు గురైన పార్కింగ్ స్థలాలను తిరిగి ప్రజలకు ఇప్పించాలని మీర్ పేట్ కార్పొరేషన్ 31వ డివిజన్ కార్పొరేటర్ విజయ లక్ష్మి కలెక్టర్ నారాయణరెడ్డికు వినతి పత్రం అందజేశారు. జనప్రియా మహానగర్లోని 5, 9ఏ బ్లాకులలోని పార్కింగ్ స్థలాన్ని కొందరు కబ్జా చేసి షెటర్లు నిర్మించారని ఆరోపించారు. ఒక్కో షెటర్ ను 10 లక్షలకు విక్రయిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.