రాష్ట్రానికి చెందిన ఉర్దూ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్‌ను ప్రతిష్టాత్మక మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.