సంగారెడ్డి: సోమేశ్వర స్వామి దేవాలయంలో అఖండ శివనామస్మరణ
కార్తీక మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పురాతన సోమేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి అఖండ శివనామస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో బిల్వాలను ఉపయోగించి శివ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శివుని కీర్తిస్తూ భక్తులు పాటలు పాడారు. అనంతరం దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.