కొండాపూర్: లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు
కొండాపూర్ మండలం మారేపల్లెలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం కార్తీకమాస పూజా కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనారాయణ స్వామి మూర్తులకు వేదమంత్రాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.