డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన ధర్నా

64చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు మంగళవారం తెల్లవారుజామున ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆందోళన చేశారు. తమ నిరసనకు ఏ రాజకీ య పార్టీకి సంబంధం లేదని, తాము స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నామని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. నిరుద్యోగులు అందరం కలిసి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్