వందే భారత్ స్లీపర్ రైలును ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని భారత రైల్వే శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో స్లీపర్ కోచ్‌లను తయారు చేస్తున్న భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) బెంగళూరు ప్లాంటు నుంచి తొలి రైలు సెప్టెంబర్ 20 నాటికి డిస్పాచ్ అవుతుంది. ఆ తర్వాత 2 నెలల పాటు ట్రయల్ రన్ జరగనుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ.సుబ్బారావు చెప్పారు.