రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో వేల సంఖ్యలో ఇళ్లు వరదలో మునిగాయి. దాదాపు 50 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. 11 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరద బాధితుల కోసం సుమారు 3,176 షెల్టర్లు, 639 వైద్య బృందాలను నియమించారు.