పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

55చూసినవారు
పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో సోమవారం పట్టపగలే దొంగతనం జరిగింది. యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. భవనం మొదటి అంతస్తులో ఉంటున్న వారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, శ్రీనివాసరెడ్డి ఉదయం 8: 30 కు ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఒక రాడ్డు సహాయంతో తాళాన్ని బద్దలు కొట్టి బీరువాలో దాచి ఉంచిన 18. 5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్