విజిలెన్స్ కమిషన్ కు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఫిర్యాదు

72చూసినవారు
విజిలెన్స్ కమిషన్ కు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఫిర్యాదు
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం చేసిన భూసేకరణలో జరిగిన అవకతవకలు, భూ అక్రమాణాలపై మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ యం. జి. గోపాల్ కి ఫిర్యాదు చేశారు. ఇట్టి విషయంపై లోతైన దర్యాప్తు చేసి భూసేకరణలో అక్రమణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ ఆధారంతో సహా లేఖను సమర్పించారు.