సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృతి చెందిన ఘటనపై రావూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఎట్టకేలకు స్పందించింది. తమ ముగ్గురు స్టూడెంట్ల మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై ప్రస్తుతం జరుగుతున్న విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం' అని ఎక్స్‌లో పోస్టు చేసింది.