హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకల సంచారం రోజురోజుకు పెరిగిపోతుందని ఆసుపత్రికి వస్తున్న రోగులు వాపోతున్నారు. గతంలో కూడా పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా వెంటనే ఉన్నత అధికారులు స్పందించి.. ఎలుకల బెడద నుంచి కాపాడాలన్నారు. తినే ఆహారంపై కూడా ఎలుకలు సంచరించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.