రాజస్థాన్‌లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. అయితే ఈసారి దసరా ఉత్సవాల్లో భాగంగా 65 అడుగుల ఎత్తైన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు రావణుడి దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.