రియల్ హీరో.. విశ్వక్‌సేన్‌పై ప్రశంసలు

76చూసినవారు
రియల్ హీరో.. విశ్వక్‌సేన్‌పై ప్రశంసలు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరణానంతరం అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. 'మెట్రో రెట్రో' పేరిట జరిగిన కార్యక్రమలో ఈ ప్రతిజ్ఞ చేశానని ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో విశ్వక్ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, జగపతి బాబు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్