హైదరాబాద్ తార్నాకలోని ఐఐసీటీ వివిధ విభాగాల్లో 29 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్, మెకానికల్, ఫిట్టర్, తదితర విభాగాల్లో 55% మార్కులతో టెన్త్, ఐటీఐ చదివిన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://www.iict.res.in/ను సంప్రదించగలరు.