చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.31కి తగ్గించాయి. తగ్గిన ధరలు జులై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. జూన్ 1న రూ.19, మే 1న రూ.30.5 చొప్పున గతంలో కంపెనీలు తగ్గించాయి. ఇక గృహ అవసరాలకు వినియోగించే LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవు.