TG: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీనిపై తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.