తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం చంద్రబాబును నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. కాగా తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలన రేపుతోంది. వెంకన్న భక్తుల విశ్వాసంతో పాలకులు ఆటలు ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.