కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణ శ్రీరాముడిపై తనకున్న భక్తిని ప్రత్యేకంగా చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం రాశారు. రెండు గంటల పాటు శ్రమించి ఎంతో ఓర్పుతో శ్రీ రామ అష్టకం లిఖించారు. కృష్ణ గతంలోనూ పెన్సిల్ ముక్కపై అనేక ప్రతిమలు రూపొందించి ఔరా అనిపించుకున్నారు. కృష్ణ టాలెంట్‌ను చూసిన కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.