హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో అమీన్ అహ్మద్ అన్సారీ అనే 7 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి నివసిస్తున్నాడు. 2021లో తన తండ్రి మృతిచెందడంతో RTCలో కారుణ్య నియామకంతో కండక్టర్‌గా ఉద్యోగం పొందాడు. అయితే బస్సు ఎత్తు 6.4 అడుగులు.. అన్సారీ ఎత్తు 7 అడుగులు కావడంతో కండక్టర్‌గా పనిచేయడం చాలా ఇబ్బందిగా మారింది. 8-10 గంటలు తల వంచి పని చేయడంతో మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆయన RTCలోనే మరొక ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.