దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో ఈ వంతెనను నిర్మించారు. పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది.